Top Stories
తెలంగాణ పోలీసులు 2026లో ఇప్పటివరకు సైబర్ మోసాలకు గురైన బాధితులకు ₹139.6 కోట్లు తిరిగి అందించడంలో సహకరించారు.
సుమారు 24,000 మంది బాధితులకు ఈ మొత్తాన్ని రీఫండ్ చేసినట్లు తాజా నివేదిక వెల్లడించింది.
National Lok Adalat, కేంద్ర హోంశాఖకు చెందిన Money Restoration Module ద్వారా రికవరీ ప్రక్రియ జరిగింది.
ఆన్లైన్ మోసాలపై ఫిర్యాదు చేసిన తర్వాత డబ్బు ఫ్రీజ్ చేయడం, చట్టపరమైన ప్రక్రియ ద్వారా తిరిగి ఇప్పించడం ఇందులో కీలకంగా ఉంది.
సైబర్ క్రైమ్ కేసుల్లో వేగంగా ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బు రికవరీ అవకాశాలు పెరుగుతాయి.
ముఖ్యంగా UPI, బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ పెట్టుబడి మోసాల్లో మొదటి గంటలు కీలకం.
తెలంగాణలో సైబర్ మోసాలపై పోలీసుల రికవరీ చర్యలకు ఇది పెద్ద స్థాయి ఫలితంగా నిలిచింది.
⚠ BREAKING All
Top Stories
సౌదీ అరేబియాలోని కీలక East–West oil pipeline డ్రోన్ దాడి తర్వాత మూసివేయబడింది. ఈ పైప్లైన్ రోజుకు సుమారు 40 లక్షల బ్యారెళ్ల చమురును రవాణా చేయగలదు.
ఇది హోర్ముజ్ జలసంధిని తప్పించి Red Sea ద్వారా చమురు ఎగుమతికి ఉపయోగపడే కీలక మార్గం.
ప్రస్తుతం సౌదీకి Yanbu వద్ద ఉన్న నిల్వలు సుమారు 5–7 రోజులు మాత్రమే సరిపోవచ్చని Reuters నివేదించింది.
దీంతో ప్రపంచ చమురు సరఫరాలో గరిష్ఠంగా సుమారు 4% వరకు ప్రభావం పడే అవకాశం ఉంది.
Brent crude సోమవారం $107.51 వద్దకు, WTI $102.32 వద్దకు పెరిగాయి.
మరమ్మతులకు కొన్ని రోజులు నుంచి కొన్ని వారాల వరకు పట్టే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ఇది కొనసాగితే భారత్లో కూడా పెట్రోల్, డీజిల్, రవాణా ఖర్చులపై ఒత్తిడి పెరగొచ్చు.
⚠ BREAKING All
Cinema & Ent
రవితేజ నటించిన ‘Irumudi’ సినిమా థియేటర్ల తర్వాత OTTకి వస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 18, 2026 నుంచి Netflixలో స్ట్రీమింగ్ కానుంది. ఐదు భాషల్లో సినిమా అందుబాటులోకి రానున్నట్లు తాజా సమాచారం. థియేటర్లలో సినిమా మంచి వసూళ్లు సాధించిందని చిత్ర బృందం పేర్కొంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు OTT విడుదలతో మరోసారి సినిమా చూసే అవకాశం లభించనుంది. ప్రస్తుతం సినిమా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే OTT తేదీ ప్రకటించడం గమనార్హం. Netflix విడుదలకు ముందు ఈ సినిమా డిజిటల్ హక్కులపై ఆసక్తి కూడా పెరిగింది. సెప్టెంబర్ 18 నుంచి ఇంటి నుంచే సినిమా చూడవచ్చు.
⚠ BREAKING All
Jobs
Staff Selection Commission (SSC) Combined Higher Secondary (10+2) Level Examination, 2026 నోటిఫికేషన్ను 14 సెప్టెంబర్ 2026న విడుదల చేసింది. LDC/JSA, DEO వంటి కేంద్ర ప్రభుత్వ Group-C పోస్టులకు 12వ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తాజా ప్రకటన ప్రకారం మొత్తం 2,536 ఖాళీలు ఉన్నాయి.
Qualification:
🎓 12వ తరగతి / Intermediate ఉత్తీర్ణత అవసరం. DEO పోస్టుల్లో కొన్ని పోస్టులకు Science streamలో Mathematics అవసరం కావచ్చు.
Age Limit:
👤 సాధారణంగా 18–27 సంవత్సరాలు; SC/ST/OBC/PwBD/ESM తదితర కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం age relaxation వర్తిస్తుంది. తుది cut-off date మరియు relaxationను notificationలో నిర్ధారించాలి.
Apply Date:
📅 14 సెప్టెంబర్ 2026 నుంచి దరఖాస్తులు ప్రారంభం.
📅 తాజా recruitment సమాచారం ప్రకారం చివరి తేదీ 7 అక్టోబర్ 2026.
⚠ BREAKING National news
Sports
భారత్–అఫ్ఘానిస్తాన్ మూడు మ్యాచ్ల T20 సిరీస్లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 13న న్యూఢిల్లీలో జరగనుంది. ఓపెనింగ్ జోడీ ఎంపికతో సహా భారత జట్టులో కొన్ని కీలక సెలక్షన్ నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి.
⚠ BREAKING Hyderabad
Top Stories
కొత్త చేయూత పెన్షన్ ల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణా సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలైన ఒంటరి మహిళలు, వితంతువులు మొదలైన వారికి కొత్త పెన్షన్ ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించిన ప్రభుత్వం ఈ దరఖాస్తుల ప్రక్రియ ఒక వైపు కొనసాగుతుండగానే మరోవైపు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ప్రారంభించింది.
పెన్షన్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరిత గతిన పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు దసరా నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మంది అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత నెల 9వ తేదీ నుంచి సెర్ప్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించడం మొదలుపెట్టింది.
మొదట దరఖాస్తు గడువు గత నెలాఖరు వరకు ఉన్నా, ధ్రువీకరణ పత్రాలు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురైనందున గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలనను ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని నిర్ణయించారు. పరిశీలన పూర్తయిన తర్వాత వచ్చే నెల మొదటి వారంలో లబ్ధిదారులను ఎంపిక చేసి దసరా నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు వంటి వర్గాల వారు ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. దరఖాస్తు సమయంలో డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదని, వెరిఫికేషన్ సమయానికి దగ్గర ఉంచుకుంటే సరిపోతుందని సూచించింది.
దరఖాస్తు చేసుకుంటున్న వారికి ఇబ్బంది లేకుండా ఒంటరి మహిళల కోసం తహసీల్దార్లతో పాటు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు కూడా ధ్రువీకరణ పత్రాలు జారీ చేయవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. వితంతువుల విషయంలో కూడా అదనపు వెసులుబాట్ల కోసం ప్రభుత్వ అనుమతి కోరారు.
ఈ చర్యల వల్ల దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరం కాగలదని, అర్హులైన వారందరికీ త్వరగా పెన్షన్ లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దసరా సందర్భంగా కొత్త లబ్ధిదారులకు పెన్షన్ అందించాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగు వేయటం నిజంగా వారికి శుభ పరిణామం.
⚠ BREAKING Hyderabad
Top Stories
వినాయక చవితి.. వరుస సెలవుల వేళ రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. ప్రధాన మార్గాల్లో ప్రయాణించే ముఖ్య మైన రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని రూట్లలో ప్రత్యేక రైళ్ల ను ప్రకటించారు. కాగా.. ఇప్పుడు ప్రధాన మార్గంలో నాలుగు జనసాధారణ్ రైళ్లను అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లు కొనసాగే మార్గంతో పాటుగా హాల్టింగ్ స్టేషన్లు... టైమింగ్స్ ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని వెల్లడించింది.
వినాయక చవితి.. వరుస సెలవులతో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ మార్గంలో 4 జనసాధారణ్ (అన్రిజర్వ్డ్) ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 12, 13 తేదీల్లో మధ్యాహ్నం 12.10గంటలకు 07235 ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి, ఇవే రోజుల్లో 07236 ప్రత్యేకరైలు సిర్పూర్ కాగజ్నగర్ నుంచి సాయంత్రం 6గంటలకు బయల్దేరుతాయని వెల్లడించారు. ఈ రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ అవసరం లేని సాధారణ బోగీలు మాత్రమే ఉంటాయి. సాధారణ, పేద ప్రయాణికులకు ఈ స్పెషల్ ట్రైన్స్ ఉపయోగపడనున్నాయి. ఈ స్పెషల్ ట్రైన్ సెప్టెంబర్ 12, 13 ఈ రెండు తేదీల్లో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:10 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకుంటుందని అధికారులు వివరించారు.
కాగా.. ఈ జనసాధారణ్ ప్రత్యేక రైలు చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. తిరుగు ప్రయాణంలో ఈ స్పెషల్ ట్రైన్ 2026 సెప్టెంబర్ 12, 13 తేదీల్లో సిర్పూర్ కాగజ్నగర్ నుంచి సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆయా తేదీల్లో రాత్రి 11 గంటల 15 నిమిషాలకు హైదరాబాద్(నాంపల్లి) చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. అదే విధంగా తిరుగు ప్రయాణంలో ఆసిఫాబాద్ రోడ్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, కాజీపేట, జనగాం, భువనగిరి, చర్లపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగనున్నట్లు తెలిపారు. కాగా.. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా వీటి కొనసాగింపు పైన నిర్ణయం ఉంటుందని అధికారులు స్పష్టం చేసారు.